*ప్రపంచ ధరణీదినోత్సవం'ఏప్రిల్22సందర్భంగారాసిన గజల్*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️
తల్లికన్న మిన్నగదా..నినుకాచును భూమాతయె
తొలినుండీ తుది దాకా..నిను మోయును భూమాతయె
తల్లిఋణం,నేల ఋణం..తీర్చలేని విలువలుగా
కండ్లుతెరువు ఇకనైనా..నినుబ్రోచును భూమాతయె
పర్యావరణ పరిరక్షణ..మనధ్యేయం సాధకుడా
స్పృహమరచి తిరిగావో..నినువీడును భూమాతయె
సహజమైన వనరులన్ని..పుడమితల్లి ప్రసాదాలు
అవగాహన లేకుంటే..నినుతుంచును భూమాతయె
చెట్లుపెంచి కాపాడిన..ఆయువిచ్చు ధరణిమాత
తాగునీరు,సాగునీరై..నినుచేరును భూమాతయె
సోంపాక సీత
22/4/22