అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు !!
తెలుగది, వెలుగది
తరతరాల సాంప్రదాయమది
ఆది లేని అనాది
సంవత్సారాది యుగాది
జీవితం షడ్రుచుల కలబోత అని తెలిపేది
మనవారైనవారందరిని ఒక్కచోట కలిపేది
మారుతున్న కాల కొలమాన ప్రతీకది
చేరుతున్న కొత్త స్నేహ పరిమళ విభూతి యది
రాశిఫలములు, వాసి బలములు...
అవమాన, రాజ్యపూజ్యాలను తెలిసికొనే తరుణమిది
ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణములను చేయు రోజు ఇది
విందూ వినోదములు, నందీ అవార్డులు మాత్రమే కాక..
చెడు అలవాట్లకు చెల్లు చెప్పాలనుకునే
మొక్కవోని సంకల్పదీక్షకు అనువైన తిథి ఇది
ఇదే ఇదే ఉగాది
ఎల్లరకు ఆనంద ప్రద ఇది
నవ జీవనమునకు
సరికొత్ర వెలుగు నొసగే సంవత్సరాది.
- దివ్య చేవూరి
🙏




