Showing posts with label My writeup. Show all posts
Showing posts with label My writeup. Show all posts

Tuesday, February 19, 2019

మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు




అమ్మ నుంచే మన అమ్మ భాష
ఆటలతో ఆనందభాష్పాలు
ఇక్కడ మాటల నేర్పును
ఈశ్వరునికి అక్షరాల మాల చేకూర్చును
ఉగ్గు పెడుతూ ఊయల పాటల భాష
ఊరిస్తూ ఊసులు ఊపే ఉయ్యాల జంపాలలో రాగాలు దీర్ఘాలను తక్షణమే
ఋణం తీర్చుకునేందుకు అమ్మభాషను
ఎప్పుడెప్పుడు నేర్చుకుందామా
ఏనుగు ఆటలు ఆడుతూ
ఐక్యమత్యంగా మన "మాతృభాష "ను
ఒకరికొకరు పంచుకుంటూ
ఓనమాలు దిద్దుతూ
ఔన్నత్యాన్ని పెంచుకుంటూ
అందరమూ గర్వించేలా , అభినందించేలా మన మాతృభాష అద్భుత:
అంటూ మాతృ భాష దినోత్సవం శుభాకాంక్షలను మన అమ్మ నేర్పిన కమ్మని భాషలో తెలుపుకుందాము !!

-దివ్య